Raashii Khanna | రాశీఖన్నా యూట్యూబ్ ఛానల్..విశేషాలివే..వీడియో
ఇటీవలే కీర్తిసురేశ్ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు రాశీ ఖన్నా (Raashii Khanna) కూడా అదే బాటలో పయనిస్తోంది.

తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రాశీ ఖన్నా (Raashii Khanna). ఈ భామ స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ ను ఫాలో అవుతుంది. ఇటీవలే కీర్తిసురేశ్ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు రాశీ ఖన్నా కూడా అదే బాటలో పయనిస్తోంది. my REAL life! Dive in అంటూ యూ ట్యూబ్ ఛానల్‌ను అందరికి పరిచయం చేసింది రాశీఖన్నా. యూ ట్యూబ్ ఛానల్ లింక్‌ను క్లిక్ చేయగానే 3 నిమిషాల నిడివి గల వీడియోకు రీ డైరెక్ట్ అవుతుంది.
ఈ వీడియోలో తన రోజువారి దినచర్య, ఆహారపు అలవాట్లు, చిన్ననాటి జ్ఞాపకాలు, మేకప్ సీక్రెట్స్, ట్రావెల్ డైరీస్ తోపాటు ఇతర అంశాల గురించి ప్రస్తావించింది రాశీఖన్నా. తన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే తన యూ ట్యూబ్ ఛానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోవాలని సూచించింది.
మొత్తానికి తన ఫాలోవర్ల కోసం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇచ్చేలా రాశీఖన్నా చేసిన ప్లాన్ బాగానే వర్కవుట్ అయి ఆమె ఫాలోవర్ల సంఖ్య మరింత పెరుగడం ఖాయమని భావిస్తున్నారు సినీ జనాలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

