Raashi Khanna in Ustaad Bhagat Singh | టాలీవుడ్లో దశాబ్దకాలంగా తనదైన ముద్ర వేసుకున్న కథానాయిక రాశీ ఖన్నాకు ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో ఇప్పటికే శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. మరో కథానాయికగా రాశీ ఖన్నా ఎంపికైనట్లు సమాచారం. అయితే ఇప్పటికే రాశీ షూటింగ్ సెట్లో అడుగు పెట్టి, పవన్ కళ్యాణ్‌తో కలిసి కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.