Raag Mayur | వయసుకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్పు.. ‘గరివిడి లక్ష్మి’ చిత్రంలో సత్తిబాబుగా రాగ్ మయూర్ మ్యాజిక్!
RaagMayur | సినిమా రంగంలో ఒక నటుడిగా రాణించాలంటే కేవలం అభినయం ఒక్కటే సరిపోదు, పాత్ర స్వభావానికి తగ్గట్టుగా శారీరక భాషను మార్చుకోవడం కూడా ఎంతో ముఖ్యం.
RaagMayur | సినిమా రంగంలో ఒక నటుడిగా రాణించాలంటే కేవలం అభినయం ఒక్కటే సరిపోదు, పాత్ర స్వభావానికి తగ్గట్టుగా శారీరక భాషను మార్చుకోవడం కూడా ఎంతో ముఖ్యం. తాజాగా గరివిడి లక్ష్మీ చిత్రంలో సత్తిబాబు పాత్రలో నటించిన రాగ్ మయూర్ తన అద్భుతమైన నటనతో ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సత్తిబాబు పాత్రకు సంబంధించిన వయసుల వారీగా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెరపై వయసు పెరిగిన పాత్రను కేవలం మేకప్‌తో మాత్రమే చూపించడం సాధ్యం కాదని గ్రహించిన ఈ యువ నటుడు, బాడీ లాంగ్వేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
యువకుడిగా ఉన్నప్పుడు నడకలో ఉండే చురుకుదనం, కళ్ళలోని ఆత్మవిశ్వాసం, భుజాల కదలికలు ఎలా ఉంటాయో.. అదే వ్యక్తి వయసు పైబడిన తర్వాత వచ్చే నెమ్మదితనం, డైలాగ్ డెలివరీలోని బ్యాలెన్స్, చూపులోని తీవ్రతలో స్పష్టమైన తేడాను రాగ్ మయూర్ చాలా సహజంగా చూపించారు. ఒకే నటుడు తెరపై కనిపిస్తున్నప్పటికీ, పాత్రలోని వేర్వేరు వయసు దశలను ప్రేక్షకులు స్పష్టంగా గుర్తించేలా ఆయన తన పెర్ఫార్మెన్స్తో మ్యాజిక్ చేశారు. నటుడిగా రాగ్ మయూర్ ఎదుర్కొన్న ఈ సవాల్‌ను సమర్థవంతంగా అధిగమించి, సత్తిబాబు పాత్రకు ప్రాణం పోసిన తీరు సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

