Pushpa The Rule | ప్రభాస్ ‘బాహుబలి’ని ‘పుష్ప 2’ బీట్ చేయనుందా.?
Pushpa The Rule | ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది ఈ చిత్రం. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Pushpa The Rule | ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది ఈ చిత్రం. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీం కూడా ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇప్పటికే ఇండియా వైడ్ భారీ ఈవెంట్లను ప్లాన్ చేసిన చిత్రబృందం బిహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్‌ను నవంబర్ 17న లాంఛ్ చేయనుంది.
ఇదిలావుంటే.. ఈ సినిమా సృష్టించే రికార్డులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఏమో ఈ సినిమా అమీర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డును బద్దలు గొడుతుందని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ఈ మూవీ ప్రభాస్ ఆల్‌టైం రికార్డు ఉన్న బాహుబలి 2 సినిమా కలెక్షన్లను బద్దలు కొడుతుందని కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో సరికొత్త రికార్డును సృష్టించనున్నాడు.
ఎందుకంటే ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాలు చూసుకుంటే మొదటి స్థానంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ (రూ.2100 కోట్లు) ఉండగా.. రెండో స్థానంలో బాహుబలి 2(రూ.1800 కోట్లు) ఉంది. వీటి తర్వాత ఆర్ఆర్ఆర్(రూ.1300 కోట్లు), కేజీఎఫ్(రూ.1200 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 చిత్రం ఇండియా వైడ్‌గా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రంకు వచ్చిన పాపులారిటీ వలన ఇప్పుడు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

