Pushpa The Rule telugu Glimps | ఇండియాలోని మోస్ట్ యాంటిసిపేటేడ్ సీక్వెల్స్‌లో పుష్ప ది రూల్ ఒకటి. బన్నీ, సుక్కు కాంబోలో తెరకెక్కిన ఈ హ్యాట్రిక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలిరోజు నుంచి కాసుల వర్షం కురిపిస్తూ నిర్మాతల పాలిట కామధేనువులా మారింది. ఇక ఎలాంటి అంచనాల్లేకుండా హిందీలో విడుదలై అక్కడ కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో బన్నీ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పుష్ప-2పై టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే శుక్రవారం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప ది రూల్ గ్లింప్స్‌ను రిలీజ్చేశారు.
తాజాగా విడుదలైన గ్లింప్స్ పుష్ప-2పై మరింత అంచనాలు పెంచేసింది. తొలిపార్టుకు మించి పుష్ప సీక్వెల్ ఉండబోతుందని సుకుమార్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. పుష్పను పోలీసులు కాల్చేశారని, ఎనిమిది బుల్లెట్లు దిగాయని, పోలీసులు నెల రోజులు వెతికినా దొరక్కపోవడంతో పుష్ప మరణించాడని అంతా అనుకుంటూ ఉండటం, పుష్ప చేసే మంచి పనుల వల్ల జనాలంతా కూడా అతడ్ని దేవుడిలా చూస్తుంటారని గ్లింప్స్‌లో చూపిన విధానం వేరే లెవల్లో ఉంది. ముఖ్యంగా బన్నీకి ఇచ్చిన ఎలివేషన్లు మామాలుగా లేవు.
ఇక పుష్ప బతికే ఉన్నాడా? లేదా? అనే అనుమానంతో జనాలు ఉండగా.. పులుల జాడ కనుక్కునేందుకు పెట్టిన నైట్ విజన్ కెమెరాల్లో పుష్పని చూపించడం, పుష్పను చూసిన తరువాత పులి కూడా రెండు అడుగులు వెనక్కి వేసిన సీన్ అయితే వేరే లెవల్. ఈ సీన్‌కు థియేటర్లో విజిల్స్ గ్యారెంటీ. ఇక చివర్లో బన్నీ ఇది పుష్ప గాడి రూలు అంటూ చెప్పిన డైలాగ్ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక గ్లింప్స్‌లో అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులొచ్చుండాదని అర్థం. అదే పులి రెండుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చొండాడని అర్థం అనే డైలాగ్ బన్నీకి వేరే లెవల్ ఎలివేషన్‌లా ఉంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ తొలిభాగం విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఇటీవలే రష్మిక బర్త్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్ తెగ ఆకట్టుకుంది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక పుష్ప పార్ట్-1 సినిమా ఇండియా మొత్తం ఊపేసింది. సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుండి క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇక షూటింగ్ దశలో ఉండగానే పుష్ప సీక్వెల్‌కు కోట్లలో బిజినెస్ జరుగుతుంది. కేవలం నాన్ థియేట్రికల్ హక్కుల కోసం పలు బడా సంస్థలు కోట్లలో ఆఫర్ చేస్తున్నాయట. టాలీవుడ్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం పలు ఓటీటీ సంస్థలు పుష్ప-2 డిజిటల్ హక్కుల కోసం అన్ని భాషలకు కలుపుకుని రూ.200 కోట్ల మేర ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో గానీ, ఈ నంబర్ మాత్రం పుష్ప రేంజ్ ఏంటో అని స్పష్టం చేస్తుంది.