Pushpa 3 | పుష్పరాజ్ ఈసారి రికార్డుల మోత మోగించాడు. పుష్ప, పుష్ప2 చిత్రాలతో థియేటర్లలో బన్నీ ఊచకోత కోసాడు. పుష్ప 2: ది రూల్ హిట్‌తో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నా, ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 3పైనే ఉంది. కానీ ఇందులోనే ఓ చిన్న కన్ఫ్యూజన్ మొదలైంది. బన్నీ హవా నార్త్ ఇండియాలో ఓ రేంజ్లో పెరిగిపోయింది. పుష్ప 2తో దాదాపు ₹900 కోట్లు కలెక్షన్ రాబట్టి, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా నెంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు. అయితే, ఇప్పుడు అభిమానుల్లో ఏకైక ప్రశ్న: పుష్ప 3 ఎప్పుడు అని?
ముందు విడుదలైన “Where Is Pushpa?” టీజర్లో కనిపించిన సీన్స్ ఒక్కటి కూడా పుష్ప 2లో లేదు. దీన్ని గమనించిన ఫ్యాన్స్, “ఇవి ఎందుకు?” అనే సందేహంలో పడ్డారు. ఇలాంటి ప్రశ్నలు ఎన్నింటినో అలా వదిలేశారు సుక్కూ. వీటన్నింటికి పార్ట్ 3లో క్లారిటీ రానుందని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు పుష్ప 3పై అంచనాలను పెంచేస్తోంది. తాజాగా సైమా అవార్డ్స్ సందర్భంగా దుబాయ్‌కి వెళ్లిన డైరెక్టర్ సుకుమార్, పుష్ప 3 మీద కీలక వ్యాఖ్యలు చేశాడు. “అవును, పుష్ప 3 తప్పకుండా ఉంటుంది. పుష్ప 2లో అసలు ప్రాముఖ్యత ఉన్న ప్రశ్నలకు ఆన్సర్లు మాత్రం 3వ పార్ట్‌లోనే ఉంటాయి,” అని తేల్చేశాడు. పుష్ప 3 సెట్స్‌పైకి రావడానికి మాత్రం కొంత టైమ్ పడనుంది. ఈ గ్యాప్‌లో బన్నీ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. అదే సమయంలో సుకుమార్ – రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా ప్లాన్‌లో ఉంది. ఈ రెండు పూర్తయ్యాకే మళ్లీ పుష్పరాజ్ రీ-ఎంట్రీ ఉంటుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుంది. కానీ.. ఇంకొంచెం టైమ్ పడుతుంది. పుష్ప 2లో వదిలిన క్లూలు, టీజర్ సీన్స్ అన్నీ పార్ట్ 3కి సంకేతాలు అని చెప్పుకొస్తున్నారు. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. రీసెంట్గా పుష్ప 2 చిత్రానికి గాను సైమా అవార్డ్ అందుకున్నారు బన్నీ. ఇప్పుడు అట్లీతో చేస్తున్న సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరగనుందని అంటున్నారు.