Pushpa 2 The rule Complete 50 Days | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. పుష్ప పార్ట్ 1 (Pushpa The Rise) సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదల రోజు నుంచే అటు రికార్డులతో పాటు పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఈ మూవీ బెనిఫిట్ షో రోజు సంధ్య థియేటర్ వద్ద మహిళ మృతి చెందడంతో ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే ఇన్ని వివాదాల మధ్య ఈ చిత్రం తాజాగా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే పలు రికార్డులను సైతం నమోదు చేసింది.
ఇక పుష్ప నమోదు చేసిన రికార్డులు చూసుకుంటే.. కేవలం 32 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (pushpa 2 collection worldwide) వసూలు చేసింది. ఇందులో రూ.900 కోట్లు కేవలం హిందీ బెల్ట్ నుంచి రావడమే విశేషం. ఇవే కాకుండా.. ఫస్ట్ రోజే.. రూ.294 కోట్లు వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక వీడియోను పంచుకుంది.
ఓటీటీ అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూపులు
ఇదిలావుంటే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓటీటీకి (Pushpa 2 The rule OTT Update) సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా జనవరి 30 లేదా 31 నుంచి ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్(Pushpa 2 On Netflix)లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఓటీటీ వెర్షన్లో రన్‌టైం దాదాపు 3 గంటల 44 నిమిషాలు ఉండబోతున్నట్లు సమాచారం. థియేటర్ వెర్షన్ 3 గంటల 20 నిమిషాలే రన్ అవ్వగా.. దీనికి అదనంగా.. 24 నిమిషాలు ఓటీటీకి జత చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది.