ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప-2 ది రూల్’. బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప ది రైజ్’ సృష్టించిన సంచలనమే ఈ హైప్‌కి కారణం. అల్లు అర్జున్, రష్మిక మందన్న, దర్శకుడు సుకుమార్‌ల ఇమేజ్‌లు ఈ సినిమాతో పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. అందుకే.. వరల్డ్‌వైడ్ ఆడియన్స్‌కి ‘పుష్ప-2 ది రూల్’ మోస్ట్ వాంటెడ్ మూవీ.
సోమవారం బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి విశేషమైన లభిస్తున్నదని, బన్నీ గంగమ్మ జాతర గెటప్‌లో వీర మాస్ అవతార్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నదని, టాలీవుడ్లో ఇంత విభిన్నంగా ఒక హీరో కనిపించడం ఇదే ప్రథమమని, ఒక్క టీజర్‌తో బన్నీ అంచనాలు పెంచేశారని మేకర్స్ చెబుతున్నారు.
‘ ఈ టీజర్లో బన్నీ చీరకట్టి, కాలు వెనక్కి మడిచి, పైటకొంగును అందుకున్న తీరు తీస్తుంటే, ‘పుష్ప’ను ఈ సినిమా అధిగమించడం ఖాయం అనిపిస్తున్నది. టీజర్లో బన్నీ యాటిడ్యూడ్, దేవిశ్రీ నేపథ్య సంగీతం మరోసారి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా పుష్పరాజ్ గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా బన్నీ విశ్వరూపం. ఆగస్ట్ 15న పండుగ చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి’ అని చిత్ర బృందం పేర్కొంది.