Purushaha | వీరు ఉలవల పవన్ కళ్యాణ్ హీరోగా డెబ్యూ ఇస్తున్న చిత్రం పురుష: (Purushaha). ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ మూవీలో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని మే 22న గ్రాండ్‌గా విడుదలచేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా విశేషాలు పంచుకున్నారు. పాపులర్ యాక్టర్ సప్తగిరి మాట్లాడుతూ.. ఈ అబ్బాయి పవన్ కల్యాణ్ అనే పేరు పెట్టుకున్నాడు. దాని వెనుక ఒక కథ కూడా ఉంది. వీళ్ల నాన్న పవన్‌కల్యాణ్‌కు పెద్ద అభిమాని. తమ్ముడు సినిమా చూసిన తర్వాత ఈయన పుట్టాడు కాబట్టి.. పవన్‌కల్యాణ్ అభిమాని కాబట్టివాళ్లు నాన్న ఈ అబ్బాయికి పవన్‌కల్యాణ్ అనే పేరు పెట్టారన్నాడు. థియేటర్లకు జనాలు రావడమే కష్టమైన ఈ రోజుల్లో వాళ్ల అబ్బాయి మీద ప్రేమతో భారీ బడ్జెట్ పెట్టి మా అబ్బాయినిస్క్రీన్పై నేను హీరోగా చూడాలని ఎంతో ఇష్టపడి ఆయన కష్టపడి సంపాదించిన డబ్బును ఈ సినిమా కోసం పెట్టారు. ఈ పవన్ కల్యాణ్‌కు మంచి భవిష్యత్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నాడు.
ఉప్పుకర్పురంబు నొక్క పోలికనుండు.. చూడ చూడ రుచుల జాడవేరు.. పురుషులందు పుణ్య పురుషులు వేరయా.. విశ్వదాభిరామ వినుర వేమ అనే పద్యాన్ని చెప్పిన సప్తగిరి.. పురుషులందు పుణ్య పురుషులైనా. మహాబలులైనా. ధైర్యవంతులైనా.. గండరగండులైనా.. ఎలాంటి వారైనా సరే భార్య ముందు బలాదూర్ అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా అన్నాడు. ఈ రోజుల్లో సినిమా రావాలంటే ఆ డైరెక్టర్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చేశాడని డైరెక్టర్‌కు పేరొస్తేనే జనాలు లోపలికి వస్తున్నారు. ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ సినిమా మొత్తం మా వీరు ఉలవలపై ఆధారపడి ఉంది. ఆయన తప్పకుండా తన మార్క్‌ను చూపించే ప్రయత్నం చేశారు. మేం మొన్ననే సినిమా చూశామన్నాడు సప్తగిరి.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ మూవీ మొదలైనప్పుడు సప్తగిరి అన్నను, కసిరెడ్డి అన్నను లేదా బయట ఏదైనా సందర్భంలో ఎవరైనా సెలబ్రిటీని చూసినప్పుడు లైవ్‌లో చూశామన్నా ఫీలింగ్ వచ్చేది. అలాగే ఈ రోజు మీ అందరినీ లైవ్‌లో చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగాఉంది. పురుష మే 22న విడుదలవుతుంది. దానికి మీ అందరి సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. డైరెక్టర్ వీరు అన్న ఎక్కడా కూడా నేను కొత్తోడినన్న భయం క్రియేట్ చేయకుండా.. నేను బయట కూడా ఎక్కువ మాట్లాడే వాడిని కాదు.. డైరెక్టర్ నన్ను దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి నన్ను ఎక్కడా కూడా ఇబ్బంది పడనీయకుండా చాలా ప్రేమగా సొంత తమ్ముడిని చూసుకున్నట్టు చూసుకొని ఈ సినిమా పూర్తి చేశారన్నాడు.
పురుషలో వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు.
Maa tho entertainment expect chestharu… kani ee film lo unna cute love story kuda mimmalni heartfully impress chestundi ❤️✨- Actor @MeSapthagiri Speech at #PURUSHAHA Press Meet
Grand release on May 22 ✨@kproductions999 @kalyanb949 @Actor_Rajkumar9… pic.twitter.com/mhbME3bf5a
— Telugu Film Journalists Association (@FilmJournalists) May 10, 2026
Sapthagiri & Kasi Reddy Garla kosam theatre ki vastaru… maa performance ki impress ayyi bayataki veltharu 🔥🎬- Heroine #Vishika Speech at #PURUSHAHA Press Meet
Grand release on May 22 ✨@kproductions999 @kalyanb949 @MeSapthagiri @Actor_Rajkumar9… pic.twitter.com/FRCmiSTvj5
— Telugu Film Journalists Association (@FilmJournalists) May 10, 2026
Ee cinema… Purusha samajam ki ankitham 🔥-Director @VeeruVulavala Speech at #PURUSHAHA Press Meet
Grand release on May 22 ✨@kproductions999 pic.twitter.com/ZcwBBW5Ayb
— Indian Clicks (@IndianClicks) May 10, 2026
TN CM Vijay | తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్.. మహిళల భద్రత సహా పలు ఫైళ్లపై సంతకాలు
Anna Lezhneva | మదర్స్ డే సందర్భంగా అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
Watch: తలలో దిగిన కొడవలితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?