Double iSmart | హుషారైన బీట్తో పర్ఫెక్ట్ మాస్ నంబర్ స్టెప్పామార్.. హైలైట్‌గా హీరో రామ్ డ్యాన్స్
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ ్టశంకర్' మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది.
Double iSmart | రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తొలి సింగిల్ ‘స్టెప్పామార్’తో ప్రచారపర్వాన్ని మొదలుపెట్టారు.
మణిశర్మ కంపోజ్ చేసిన ఈ గీతాన్ని భాస్కరభట్ల రచించారు. అనురాగ్ కులకర్ణి, సాహితి ఆలపించారు. హుషారైన బీట్తో పర్ఫెక్ట్ మాస్ నంబర్‌గా తెరకెక్కించిన ఈ గీతంలో హీరో రామ్ డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
పూరి జగన్నాథ్ తనదైన శైలి మాస్, యాక్షన్ అంశాలతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్రబృందం పేర్కొంది. సంజయ్‌దత్, కావ్యథాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కే నాయుడు, జియాని జియాన్నెలి, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

