కంటతడి పెట్టిస్తున్న పునీత్ రాజ్‌కుమార్ పెంపుడు కుక్కలు..

Puneeth rajkumar | నోరులేని జీవాలే కదా అంటూ వాటిని తక్కువగా అంచనా వేయకూడదు. అవసరం వచ్చినప్పుడు మనుషుల కంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ యజమానుల గురించి ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. అలాంటి తమ యజమాని ప్రాణం పోయింది అంటే వాటి ప్రాణాలు ఇచ్చేయడానికి కూడా వెనకాడవు. గతేడాది బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు ఆయన పెంపుడు కుక్క కూడా వారం రోజుల పాటు ఏమీ తినకుండా అనారోగ్యం పాలైంది. చివరికి వాళ్ల కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప అది ప్రాణాలతో బయట పడలేదు. ఇప్పుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పెంపుడు కుక్కలు పరిస్థితి కూడా ఇలాగే తయారైంది.
పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి కన్నడిగులు కన్నీరు పెడుతూనే ఉన్నారు. అప్పు లేడనే బాధను వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే దాదాపు 15 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఆయన ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కలు అప్పు ఇక రాడనే విషయాన్ని అర్థం చేసుకోలేక.. ఆయన ఫోటో ముందుకెళ్లి దీనంగా ఏడుస్తూ కూర్చుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
పునీత్ చనిపోయినప్పుడు ఆయన భౌతికకాయం దగ్గరికి పెంపుడు కుక్కలను తీసుకొచ్చారు. చాలా సేపు వరకూ వాటి యజమాని దగ్గర నుంచి కదలలేదు. పునీత్ ఇక లేడని.. తిరిగి రాడని పాపం వాటికి అర్థం కాక అక్కడ చాలా సేపు వరకు ఉండిపోయాయి. ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత కూడా పునీత్ చిత్ర పటం దగ్గరికి వెళ్లి అక్కడే మౌనంగా కూర్చుని దీనంగా చూస్తున్నాయి రెండు పెంపుడు కుక్కలు. వీటి బాధ చూడలేక కుటుంబ సభ్యులు కూడా బోరున విలపిస్తున్నారు. ఎంతైనా మూగజీవాలు అందించే ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ఆ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమా? గంటలోనే ఎలా ప్రాణాలు పోయాయి?
Puneet Raj Kumar: చివరి క్షణాల్లోను యాక్టివ్‌గా కనిపించిన అప్పు.. వీడియో వైరల్
పునీత్ మరణ వార్త చదువుతూ.. లైవ్‌లోనే ఏడ్చేసిన న్యూస్ రీడర్
పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా..?
పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరికి కదులుతున్న తమిళ హీరోలు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

