puneeth | అన్నయ్య సినిమా రిలీజ్ రోజే తమ్ముడు అస్తమయం..

Puneet rajkumar| పొద్దున్నే అభిమాన హీరో సినిమా విడుదల.. థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం.. టికెట్ల కోసం హంగామా.. రాత్రి నుంచే రేపటి రిలీజ్ కోసం ప్రణాళికలు.. చాలా రోజుల తర్వాత థియేటర్లో ఒక పెద్ద సినిమా విడుదల.. సరిగ్గా అలాంటి సమయంలోనే పిడుగు లాంటి వార్త.. తాము ఎంతగానో ఇష్టపడే తమ అభిమాన కథానాయకుడు గుండెపోటుతో మరణించాడు అనే చేదు నిజం.. ప్రస్తుతం కన్నడనాట నడుస్తున్న పరిస్థితులు. అక్టోబర్ 29 కోసం రాజ్ కుమార్ అభిమానులు గత కొన్ని రోజులుగా వేచి చూస్తున్నారు. దానికి కారణం ఆ రోజు శివరాజ్ కుమార్ హీరోగా నటించిన బజరంగి 2 సినిమా విడుదల కావడమే. కరోనా తర్వాత కర్ణాటకలో పెద్ద సినిమాలు పెద్దగా విడుదల కాలేదు.
ఇలాంటి సమయంలో శివరాజ్ కుమార్ నటించిన భజరంగి 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతో ఈ సినిమా కోసం శివన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయన తమ్ముడు పవర్ స్టార్ పునీత్ గుండెపోటుతో మరణించాడనే విషయం తెలుసుకొని తల్లడిల్లిపోయారు అభిమానులు. ఈయన మరణం కేవలం అభిమానులకు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా షాకింగ్ విషయం. ఆయన లేడన్న చేదు నిజాన్ని అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఇది నిజం కాకపోతే బాగుండు అంటూ ఆ దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఇంత పెద్ద శిక్ష మాకు ఎందుకు వేసావు దేవుడా అంటూ గుండెలు పగిలిపోయేలా రోదిస్తున్నారు. పునీత్ మరణవార్త తెలిసిన వెంటనే తాము రోడ్డుమీద ఉన్నామనే విషయం కూడా మరిచిపోయి.. కన్నడ యువత కన్నీళ్లు పెట్టుకుంటుంది.

శివ రాజ్ కుమార్ సినిమా థియేటర్ల ముందున్న అభిమానులు.. బ్యానర్స్ కడుతూ పునీత్ మరణ వార్త తెలుసుకొని అక్కడే రోదించారు. ఈ విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నడ సినిమా మార్కెట్ పెరగడంలో తనవంతు కృషి చేసిన పునీత్.. ఇంత చిన్న వయసులో కన్ను మూస్తాడని కలలో కూడా అనుకోలేదు. అన్నింటికీ మించి అన్న సినిమా విడుదలయ్యే రోజు తమ్ముడు చావుకబురు వస్తుందని అభిమానులు అస్సలు ఊహించలేదు. రెండు రోజుల కింద భజరంగి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నయ్యతో కలిసి డాన్స్ చేసిన పునీత్.. ఇప్పుడు నిర్జీవంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఏదేమైనా పునీత్ మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కలిచి వేస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneeth Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

