కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా వస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజవుతోంది. పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను పొంగే నది (Ponge nadhi) సాంగ్ రూపంలో అందించారు.
ఈ చిత్రంలో కార్తీ (Karthi) చోళ సైన్యాధ్యక్షుడు వల్లవరాయన్ వండియదేవన్ పాత్రలో నటిస్తున్నాడు. మాగానికి మేల్కొలిపే తొలిమబ్బు శబ్దం..సిలగుండెకు మేల్కొలిపే ఉలి తెచ్చే శబ్దం..బాణానికి మేల్కొలిపే బలిశత్రువ శబ్దం అంటూ కార్తీ అండ్ జనాలతో కలిసి పాడుకుంటున్నాడు. అనంత శ్రీరామ్ ఈ పాటను రాయగా..ఏఆర్ రెహమాన్ తోపాటు ఆయన సోదరి రిహానా, బాంబ బక్య పాడారు. చోళుల కాలంలో ప్రఖ్యాతి గాంచిన కావేరి నది బ్యాక్‌డ్రాప్ లో సాగుతున్న ఈ పాట సరికొత్త స్టైల్లో మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
పొన్నియన్ సెల్వన్-1లో విక్రమ్, శరత్‌కుమార్, ప్రకాశ్ రాజ్, పార్థీబన్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, అరవింద్ స్వామి, త్రిష, జయరామ్, విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాళ కీలక పాత్రలు స్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.