Project K | ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీపికా పడుకోన్ నాయికగా నటిస్తున్నది. మరో కీలక పాత్రను దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అసెంబ్లింగ్ ది రైడర్స్ (విలన్స్) మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రతినాయకుడి సైన్యాన్ని చిత్రబృందం ఎలా రూపొందిస్తున్నారు అనేది చూపించారు.
వారి దుస్తుల డిజైన్ బ్యాట్‌మ్యాన్ వంటి హాలీవుడ్ సూపర్‌హీరో చిత్రాలను పోలి ఉంది. ఈ వీడియోలో రైడర్స్ అంటే ఒకేలా కనిపించే శత్రు సేన అంటూ వివరించారు. కాస్ట్యూమ్ డిజైనర్స్ అర్చన రావు, నితిన్ జైని, ప్రొడ్యూసర్ స్వప్న దత్, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ వీడియోలో కనిపించారు. రైడర్స్ మేకోవర్ కోసం ఎక్కువ ఖర్చు అయ్యిందని నిర్మాత స్వప్న తెలిపారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.