NTR-Trivikram movie | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ కెరీర్లో దూసుకుపోతున్నాడు. గతేడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ మరికొన్ని రోజుల్లో వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లోనూ తన సత్తా చాటనున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఆగష్టు 15న విడుదల కానుండగా, అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఒకటి చేస్తున్నాడు తారక్. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుడగా.. దీనికోసం బరువు కూడా చాలా తగ్గాడు తారక్.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మైథాలాజికల్ మూవీగా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించబోతున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయాల గురించి పంచుకున్నాడు నాగవంశీ. త్రివిక్రమ్ మొదటిసారి మైథలాజికల్ సినిమా చేస్తున్నారు. అందుకే ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా లాంఛింగ్తో పాటు శరవేగంగా షూటింగ్ ఉంటుంది. త్రివిక్రమ్- వెంకటేశ్ సినిమా ఆగస్టు నుంచి ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఇది పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మొదలవుతుందని తెలిపాడు.