బాలకృష్ణతో సినిమా చేస్తా!
‘గత రెండేళ్లుగా చెన్నైలో నిర్మిస్తున్న కళ్యాణ్ అమ్యూస్మెంట్ పార్క్ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా. త్వరలో దానిని ప్రారంభించబోతున్నాం. ఇక బాలకృష్ణగారితో సినిమా కోసం ఎదురుచూస్తున్నా. ఆయన ఎప్పుడూ చేద్దామన్నా రెడీగా ఉన్నా’ అన్నారు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘కల్యాణ్ అమ్యూస్మెంట్ పార్క్‌ను తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రారంభించాలనుకుంటున్నాం.
‘గత రెండేళ్లుగా చెన్నైలో నిర్మిస్తున్న కళ్యాణ్ అమ్యూస్మెంట్ పార్క్ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా. త్వరలో దానిని ప్రారంభించబోతున్నాం. ఇక బాలకృష్ణగారితో సినిమా కోసం ఎదురుచూస్తున్నా. ఆయన ఎప్పుడూ చేద్దామన్నా రెడీగా ఉన్నా’ అన్నారు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘కల్యాణ్ అమ్యూస్మెంట్ పార్క్‌ను తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రారంభించాలనుకుంటున్నాం. ఇండియాలో తొలిసారి అందులో స్కైథియేటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం’ అని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ వ్యయంపై నియంత్రణ లేకుండా పోయిందని, హిందీలో అరవై రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంటే..ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని కల్యాణ్ చెప్పారు.
‘నిర్మాతగా సినిమాకే నా తొలి ప్రాధాన్యత. వెబ్‌సిరీస్‌లలో శృతిమించిన కంటెంట్ ఉంటుంది. ఆ తరహా సిరీస్‌లను నేను తీయలేను. రాబోవు కాలంలో డిజిటల్ రైట్స్ తగ్గిపోతాయి. హీరోలు కూడా ఎక్కువగా వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్తారనుకుంటున్నా’ అని ఆయన అన్నారు. అవార్డు వేడుకల గురించి మాట్లాడుతూ ‘అవార్డు తీసుకున్న ఆర్టిస్టులు అది తమకు గొప్ప గౌరవమని భావించే పరిస్థితులు ఇప్పుడు లేవు. అవార్డు వేడుక అంటే ఇండస్ట్రీ అంతా ఓ కుటుంబంలా హాజరవ్వాలి. ఓ పండగలా చేసుకోవాలి. ఒకప్పుడు అలా జరిగేవి. నేటి పరిస్థితుల్లో అవార్డు వేడుకలు ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. బాలకృష్ణగారితో వచ్చే ఏడాది సినిమా చేయాలనుకుంటున్నాం. అలాగే మరో రెండు చిత్రాలు సన్నాహాల్లో ఉన్నాయి’ అని సి.కల్యాణ్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
Eluru Ganganamma | ఏలూరు గంగానమ్మ ఆంథెమ్.. యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న భక్తి గీతం!
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

