గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పలు రంగాల్లో ప్రతిభ చూపిస్తున్న సంగతి తెలిసిందే. నటిగా, నిర్మాతగా, రచయిత్రి, యువ పారిశ్రామికవేత్తగా విజయవంతమైంది. ఇటీవల రెస్టారెంట్ రంగంలోకి కూడా దిగింది. న్యూయర్క్‌లో ‘సోనా’ పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్‌కు సహా యజమానిగా వ్యవహరిస్తోంది. ఆ మధ్య రెస్టారెంట్‌కు సంబంధించి పూజలు చేయగా, వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.
సోనా పేరుతో ప్రియాంక చోప్రా రెస్టారెంట్ ప్రారంభం కాగా, 2019 సెప్టెంబర్‌లో నిర్మాణం మొదలైంది. ఈ ఏడాది మార్చిలో దీనిని ప్రారంభించారు. అయితే అప్పటి నుండి తన రెస్టారెంట్లో సమయాన్ని గడిపే అవకాశం ప్రియాంకకు దొరకలేదు. రీసెంట్గా తన హోటల్లో అడగుపెట్టిన ప్రియాంక పలు వంటకాలు రుచిచూసింది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. మూడేళ్ల ప్లానింగ్ తర్వాత సోనా పూర్తైంది. కిచెన్‌లోకి వెళ్లి మా హోటల్ బృందాన్ని కలవాలని నా మనసు పరితపించేది. మిమీస్ పేర రూపొందించిన ప్రైవేటు డైనింగ్ రూం, ఇంటీరియర్, రుచికరమైన ఆహారం, డ్రింక్స్ అద్భుతంగా ఉన్నాయి’’ అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు.