బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో33వ ఎపిసోడ్ చాలా స్పెషల్ అని చెప్పాలి. అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన తర్వాత ప్రియాంక చాలా బాధలు పడింది. తన తండ్రికి కూడా అలా మారినట్టు తెలియదని ఈ షోలోనే పేర్కొంది. అయితే ప్రియాంక బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ ఆమెకు మరచిపోలేని కానుకను అందించాడు. ప్రియాంక నిర్ణయాన్ని తన తండ్రి స్వాగతిస్తూ మాట్లాడగా, ఆ వీడియోని ప్లే చేశారు.
నాన్న..సాయి తేజ ‘అబ్బాయైనా, అమ్మాయైనా సర్వం నువ్వే నాకు. నువ్వు అనుకుంది సాధించాకే ఇంటికి రావాలి. నువ్వు అమ్మాయిగా మారావని ఆదరించడం మానేస్తాం అని ఎప్పుడూ అనుకోకు, నిన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పారు పింకీ తండ్రి . ఆ తర్వాత పింకీ తమ్ముడు పంపిన చీర.. గాజులు.. బొట్టు.. పూలతో అలంకరించారు హౌజ్‌మేట్స్. అందరి ఆశీర్వాదాలు తీసుకొని చాలా సంతోషించింది.
తన తండ్రి వీడియో చూసాక పింకీ చాలా ఎమోషన్ అయింది. తను పడ్డ కష్టాలను గుక్కపెట్టి చెప్పుకుంటూ ఏడ్చేసింది పింకీ. పండగకు ఇంటికి వెళ్లినా కూడా దొంగచాటుగా వెళ్లేదాన్ని పక్కింటి వాళ్లకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేశాడంటే నమ్మలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకుంది.
ఇక తను బిగ్‌బాస్ నుంచి ఏ వారం వెళ్లిపోయినా సరే, కానీ వెళ్లగానే నాన్నను పట్టుకుని గట్టిగా ఏడవాలనుందని మనసులోని మాటను బయటపెట్టింది. అనంతరం అందంగా ముస్తాబైన పింకీ .. అనీ మాస్టర్, సన్నీ, మానస్‌ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇంతలో హమీదా తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడవడంతో శ్రీరామ్ ఆమెను హత్తుకుని ఓదార్చాడు.