బిగ్ బాస్ కార్యక్రమంలో 12వ వారం రవి ఎలిమినేట్ కావడంతో ఇంటా, బయటా దీని గురించే చర్చలు నడుస్తున్నాయి. టాప్ 3లో ఉంటాడనుకున్నా అని షణ్ను, టాప్ 2లో ఊహించానని శ్రీరామ్ చెప్పుకొచ్చారు. అయితే 12వ వారం తాను ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అయినందుకు సంతోషం వ్యక్తం చేసింది కాజల్ . మరోపక్క మానస్.. తను టైటిల్‌ను లెక్క చేయనని తేల్చేశాడు.
ప్రేక్షకుల మనసులు గెలవడమే తనకు ముఖ్యం అని చెప్పిన మానస్.. ప్రియాంక విషయం ప్రస్తావిస్తూ.. ఆమెను ముట్టుకోవాలన్నా, హగా ఇవ్వాలన్నా కూడా భయం వేస్తుంది. ఎక్కడ ఎలాంటి ఫీలింగ్ వస్తాయోనని హగ్ చేసుకోవడమే మానేశానని అన్నాడు. అయితే పింకీ చాలా ఒంటరిగా ఫీలవుతుంది. ఇదే విషయాన్ని సిరి..షణ్ముఖ్‌తో షేర్ చేసింది.
ప్రియాంక రవి లేని లోటు గురించి సిరితో చెప్పుకొచ్చింది. నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు నాకు కనిపించే వ్యక్తి రవి అన్నయ్య, అతడు లేకపోతే నాకు ధైర్యం లేనట్లు అనిపిస్తోందని బాధపడింది పింకీ. మరోపక్క షణ్ను వద్దంటున్నా సిరి హగ్గివ్వడానికి వెళ్లింది. అతడు ఎంత వారించినా వినకుండా ఫ్రెండ్షిప్ హగ్గంటూ షణ్నును హత్తుకుంది.
ఇక షణ్ముఖ్.. పింకీకి జ్ఞానోదయం కలిగించేలా ప్రయత్నించాడు. షణ్ముఖ్.. ప్రియాంకతో మాట్లాడుతూ.. సన్నీ, మానస్, కాజల్ ధైర్యం ఏంటంటే.. నిన్నేం చేసినా నువ్వు వాళ్లను నామినేట్ చేయవు, ఎదురు తిరగవని వాళ్ల నమ్మకం. నువ్వు వాళ్ల కంట్రోల్లో ఉన్నావనుకుంటున్నారు అని ఆమెను మేల్కొలిపేందుకు ప్రయత్నించాడు.