Priyanka Chopra | ప్రియాంక-నిక్ జోనస్‌ల కూతురు పేరేంటో తెలుసా?
Priyanka Chopra-Nick Jonas | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను డిసెంబర్ 2018లో ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మూడేళ్ళ తర్వాత ఈ ఏడాది జనవరిలో వీరిద్దరు సరోగసి ద్వారా తల్లి తండ్రులైనట్లు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు ఈ జంట తన బిడ్డ పేరును గాని ఫోటోలని గాని బయటకు తెలియనివ్వలేరు. అయితే తాజాగా వీళ్ళ కుతురు పేరు బయటకు వచ్చింది. ప్రియాంక-నిక్ దంపతులు తమ కూతురుకు ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’ అని నామకరణం చేశారు. ఈ పేరులో మాల్టీ అంటే పువ్వు అని అర్థం. అంతేకాకుండా ప్రియాంక తల్లి మధుమాల్టీ నుంచి మాల్టీ అని తీసుకున్నారట. ఇక మేరీ అనేది జోనస్ తల్లి పేరు. బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ప్రియాంక-నిక్ కూతురు అమేరికాలోని శాండియాగోలో జనవరి 15న జన్మించింది.
ప్రియాంక ప్రస్తుతం నటించిన హాలీవుడ్ అమేరికన్ రొమాంటిక్ డ్రామా ‘ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మి’ షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. జేమ్స్ స్ట్రోయుస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2016లో జర్మనీలో వచ్చిన ‘ఎస్ఎమ్ఎస్ ఫుర్ డిచ్’ అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. సామ్ హ్యూగన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

