నాలోని నటిని చూడలేకపోయాడు
బాలీవుడ్‌లోని ఓ దర్శకుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తన కెరీర్ ప్రారంభంలో సదరు దర్శకుడు అమానవీయంగా ప్రవర్తించాడని పేర్కొంది. లో దుస్తుల్లో తనను చూడాలనుకుంటున్నట్లు ఆ దర్శకుడు మాట్లాడిన మాటలతో ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది ప్రియాంక.
బాలీవుడ్‌లోని ఓ దర్శకుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తన కెరీర్ ప్రారంభంలో సదరు దర్శకుడు అమానవీయంగా ప్రవర్తించాడని పేర్కొంది. లో దుస్తుల్లో తనను చూడాలనుకుంటున్నట్లు ఆ దర్శకుడు మాట్లాడిన మాటలతో ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది ప్రియాంక. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ…‘తమిళ చిత్రంతో నాయికగా అరంగేట్రం చేశాను. 2003లో బాలీవుడ్లో ఓ సినిమా అంగీకరించా. ఈ చిత్రంలో అండర్‌కవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాలి.
రహస్యాలు తెలుసుకునేందుకు హనీ ట్రాప్ చేయాలి. ఆ సీన్లో లో దుస్తులు వేసుకుని నటించాలని దర్శకుడు చెప్పాడు. అప్పుడే సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్నాడు. ఆ సంఘటన అమానవీయంగా అనిపించింది. ఆ చిత్రం నుంచి బయటకు వచ్చేశా. నటిగా ఆ పాత్రకు, సినిమాకు నేను ఏం చేయగలను అనేది ఆ దర్శకుడు చూడలేదు. కేవలం గ్లామర్‌నే నమ్ముకున్నాడు’ అని చెప్పింది. ప్రస్తుతం ప్రియాంక ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘జీలే జరా’ చిత్రంలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

