‘ఆర్ఆర్ఆర్’ తమిళ్ సినిమానట!
సరైన విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఒక్కోసారి తెలియకుండా తప్పులు జరిగిపోతుంటాయి. అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా విషయంలో అదే జరిగింది. అమెరికా జర్నలిస్ట్ డాజ్ షెఫర్డ్తో జరిపిన పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రియాంకచోప్రా ‘ఆర్ఆర్ఆర్'
సరైన విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఒక్కోసారి తెలియకుండా తప్పులు జరిగిపోతుంటాయి. అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా విషయంలో అదే జరిగింది. అమెరికా జర్నలిస్ట్ డాజ్ షెఫర్డ్తో జరిపిన పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రియాంకచోప్రా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తమిళ సినిమా అంటూ పదేపదే చెప్పడం అభిమానుల్ని విస్మయానికి గురిచేసింది. దక్షిణాది సినిమాపై మంచిపట్టున్న ప్రియాంక ఇలాంటి పొరపాటు చేయడమేంటని సోషల్మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. అసలు ఈ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఆసాంతం ఆయోమయంగా ఉందని విమర్శలొస్తున్నాయి.
ఇంటర్వ్యూ ఆరంభంలో డాజ్ షెఫర్డ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని బాలీవుడ్ సినిమాగా పేర్కొన్నారు. ఆయన మాటల్ని సరిదిద్దే క్రమంలో ప్రియాంకచోప్రా సైతం తప్పులో కాలేసింది. ‘ఆర్ఆర్ఆర్’ తమిళ సినిమా అని..హాలీవుడ్ అవెంజర్స్ తరహాలో ఇండియాలో పాపులర్ అయిందంటూ ప్రశంసలు కురిపించింది. అర్ధగంటకుపైగా సాగిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ఎక్కడా తన తప్పుని తెలుసుకోకుండా ‘ఆర్ఆర్ఆర్’ను తమిళ సినిమా అని చెప్పడం శ్రోతలకు చికాకు తెప్పించింది. కొందరు మాత్రం మాటల ప్రవాహంలో దొర్లిన తప్పు ఇదని ప్రియాంకచోప్రాకు మద్దతు తెలుపుతున్నారు. లాస్ఏంజెల్స్లో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్కు సైతం హాజరైన ప్రియాంకచోప్రా ఇంత అవగాహన లేకుండా ఎలా మాట్లాడిందని తెలుగు సినీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Priyanka Chopra
- RRR
- Tamil film
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

