Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ టీజర్ వచ్చేసింది.. డిసెంబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్!
Idupu Kayitham | టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ‘ఇడుపు కాయితం’.
Idupu Kayitham | టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ‘ఇడుపు కాయితం’. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే టాలెంటెడ్ హీరో ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
తెలంగాణ మట్టి వాసన ఉట్టిపడేలా, పల్లెటూరి సంప్రదాయాలు మరియు కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రియదర్శి సరసన నాగదుర్గ కథానాయికగా నటిస్తూ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమవుతున్నారు. వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్, బన్నీ వాస్, తబితా సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి అందిస్తున్న సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’, ‘గడప’, ‘బరాత్ బీట్’ పాటలు శ్రోతలను విపరీతంగా అలరించగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ టీజర్ వచ్చేసింది.. డిసెంబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్!
Jammu Kashmir: కశ్మీర్లో ఎస్పీవోలు అదృశ్యం.. బుల్లెట్ గాయాలతో మృతదేహాలు లభ్యం
1000 Drums Wangala Festival | 1000 డ్రమ్స్ వంగాలా ఫెస్టివల్‌ను చూశారా..? వీడియో
Volga Videos | వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.34.44 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
Journalist Helle Lyng: కేంద్ర మంత్రి అమిత్‌షాకు వీడియో పోస్టు చేసిన నార్వే జర్నలిస్టు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

