SaveTheTigers3 Trailer | ప్రదీప్ అద్వైతం రచనలో మహి వి రాఘవ్ (Mahi V Raghav) డైరెక్ట్ చేసిన పాపులర్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్(Save the Tigers). ఇప్పటికే సీజన్ 1, సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వెబ్ షోలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. సేవ్ ది టైగర్స్ సీజన్ 3కి కూడా వస్తుందని తెలిసిందే. సీజన్ 3 పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో హాట్ స్టార్‌లో జూన్19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. రెండు ప్రపంచాలను ఢీకొట్టిన గర్జన..దీన్ని దైవ ప్రణాళిక అనండి లేదంటే స్వచ్ఛమైన విధి అనండి… అందరి దృష్టిని ఆకర్షించడానికి, అనూహ్య విజయం సాధించడానికి టైగర్స్ తిరిగి వచ్చారు.. అంటూ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్దాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి.. అని రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం చెప్పే డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్. రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణచైతన్య), ఘంటా రవి (ప్రియదర్శి) బార్లో కలిసి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నోడు నాకు దొరికితేనా అని విక్రమ్ అన్న వెంటనే స్వర్గంలో ఇంద్రుడి రోల్లో వెన్నెల కిశోర్ ప్రత్యక్షమవుతాడు. అక్కడి నుంచి కథ ట్రాక్ మారి.. ఘంటా రవి ఎమ్మెల్యేగా ఎదగడం, రాహుల్ ప్రముఖ స్క్రీన్ ప్లే రైటర్ అవడం, విక్రమ్ ఓ పెద్ద కంపెనీకి సీఈవో అవడం చూడొచ్చు. ఈ క్రమంలో దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, రోహిణి అండ్ వెన్నెల కిశోర్ పాత్రలతో సాగే కామిక్ టచ్‌తో థర్డ్ పార్ట్ ఉండబోతున్నట్టు ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది.
ప్రదీప్ అద్వైతం, మహి వీ రాఘవ్ క్రియేషన్‌లో రాబోతున్న సీజన్ 3ని శ్రీరామ్ ఎరగం డైరెక్ట్ చేస్తుండగా.. అజయ్ అరసాడ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సిరీస్ యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అందరికీ కనెక్ట్ అవుతూ.. దక్షిణాదిలోనే కాదు.. ఇండియా మొత్తంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
A ROAR that made two worlds collide! 🌎💥
Call it God’s plan or pure destiny… the TIGERS are back to turn heads, flip tables & own their absolute redemption arc! 👑⚡#SaveTheTigers3 Trailer Out Now 🐯
Streaming from June 19 on JioHotstar! 💫#SaveTheTigers3OnJioHotstar… pic.twitter.com/TumJHU4Uj6
— BA Raju’s Team (@baraju_SuperHit) May 30, 2026
This Weekend OTT | ‘జెట్ లీ’, ‘కర’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాలివే!
Rajamouli | ‘వారణాసి’కి మళ్లీ లీకుల బెడద.. జక్కన్న మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి?
Transgender Influencer: మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్‌జెండర్ ఇన్ఫ్లూయెన్సర్