బిగ్ బాస్ హౌజ్‌లో కొన్ని జంటల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తున్న విషయం తెలిసిందే.అయితే మానస్.. హమీదాకు గోరు ముద్దలు తినిపించడంతో ప్రియాంక సింగ్ కాస్త హర్ట్ అయినట్టు తెలుస్తుంది. మానస్ జైల్లో ఉన్నందుకు ప్రియాంక సింగ్ ఆ జైలు దగ్గరకి వెళ్లి.. నువ్వు జైల్లో ఉన్నావు కదా! మరి హమీదాకు ఎవరు తినిపిస్తారు? అని అడిగింది.
హమీదాపై ప్రియాంక చిర్రుబుర్రులాడుతుంటే పరిస్థితి గమనించిన మానస్.. ఆమె తనకు ఫ్రెండ్ అని, సిస్టర్ అనమంటే కూడా అంటానని అనడంతో పింకీ సంతోషపడింది. నేనే అయితే అవసరమైతే శ్రీరామ్‌కు అయినా రాఖీ కడతా కానీ నీకు మాత్రం కట్టనని మానస్‌కు తెగేసి చెప్పింది పింకీ . ఇక లోబో మార్నింగ్ సమయంలో నిద్ర పోవడంతో కుక్కలు మొరిగాయి.
కెప్టెన్‌గా తన మాట ఎవరు వినట్లేదని బాగా హర్ట్ అయిన జస్వంత్ తనకు తానే శిక్ష విధించుకునన్నాడు. ఇంతలోనే హౌజ్‌లో ఎవరో పసిపాప ఏడుపులు, నవ్వులు వినిపించడంతో అందరూ షాకయ్యారు. కొత్త కంటెస్టెంట్ ఎవరో వస్తున్నారని అంతా అనుకున్నారు కాని బోమ్మను పంపాడు. పసిపాప నవ్వులు వినగానే చాలామంది వారి కన్నబిడ్డలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.