e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Priya: స‌న్నీపై పూల‌కుండి ఎత్తిన ప్రియ‌.. ద‌మ్ముంటే కొట్ట‌మ‌ని మీద‌మీద‌కు వెళ్లిన సన్నీ

Priya: స‌న్నీపై పూల‌కుండి ఎత్తిన ప్రియ‌.. ద‌మ్ముంటే కొట్ట‌మ‌ని మీద‌మీద‌కు వెళ్లిన సన్నీ

కెప్టెన్సీ కోసం బంగారు కోడి పెట్ట అనే టాస్క్ జ‌రుగుతుండ‌గా, ఈ టాస్క్‌లో జెస్సీకి బిగ్ బాస్ ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఎవరైనా ముగ్గురు సభ్యులు సభ్యుల దగ్గర గుడ్లు లేకుండా నాశనం చేయాల్సి ఉంటుందని, ఈ సీక్రెట్‌ టాస్క్‌లో గెలిస్తే నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికవుతారని చెప్పాడు. మ‌రో బెస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. హౌజ్‌లో న‌చ్చిన వారి సాయం కూడా తీసుకోవ‌చ్చని అన్నాడు.

జెస్సీ.. సిరి సాయం తీసుకోగా, ఆమె ష‌ణ్ముఖ్‌, ప్రియ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఎగ్స్ ఇవ్వాల‌ని కోరింది.వారిద్ద‌రు ఓకే చెప్పారు. అందరూ పడుకున్న తరువాత గుడ్లు నొక్కేయడం మొదలుపెట్టాడు సన్నీ . జెస్సీ దాచుకున్న గుడ్లను కొట్టేసి మానస్‌కి ఇచ్చాడు. అయితే ఇది కామెడీగానే చేశాడు సన్నీ. కాని జెస్సీ దీనిని సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో స‌న్నీతో యుద్ధం చెల‌రేగింది. ఇక సన్నీ తన బుట్ట పక్కనపెట్టి గుడ్లు కోసం పోరాడుతుంటే.. అతన్ని టార్గెట్ చేసిన ప్రియ అతని బుట్టలో ఉన్న గుడ్లను నొక్కేయడానికి ట్రై చేసింది.

- Advertisement -

స‌న్నీ ప్లీజ్ ప్రొటెక్ష‌న్ అంటూ ప్రియ‌ను ప‌క్క‌కు నెట్టేయ‌గా, దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఓ రేంజ్ వార్ న‌డిచింది. పూల‌కుండీని స‌న్నీపై ఎత్తింది. ఫిజిక‌ల్‌గా ఆడితే అస్స‌లు బాగుండ‌ద‌ని ప్రియ వార్నింగ్ ఇవ్వ‌గా, ఫిజిక‌ల్‌గా ఎవ‌డు ఆడిండు, ప్రొట‌క్ష‌న్ చేసుకున్నా అని స‌న్నీ అన్నాడు.ఫిజికల్ అయితే చెంప పగిలిపోద్దని నోరు పారేసుకుంది.. దీంతో సన్నీ.. మంచిగా మాట్లాడు.. నోరు పారేసుకోకు మళ్లీ చెప్తున్నా.. అని హెచ్చరించాడు. ప్రియ ప‌దే ప‌దే స‌న్నీని దూషిస్తుండ‌గా, దమ్ముంటే కొట్టు అని సన్నీ మీది మీదికి వెళ్లాడు. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య భీక‌ర స్థాయిలో గొడ‌వ జ‌రిగింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement