Vijayashanthi | టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత విజయశాంతి నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 18న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిత్ర బృందం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ‘ముచ్చటగా బంధాలే’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఈవెంట్లో పాల్గొన్న విజయశాంతి చిత్ర బృందాన్ని పరిచయం చేశారు.
ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషించారు. పెళ్లి సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న పృథ్వీరాజ్ ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా కూడా చేశాడు. అయితే ఎందుకో కొంత గ్యాప్ ఇచ్చిన పృథ్వీ ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో విడుదలైన చాలా సినిమాలలో పృథ్వీ కీలక పాత్రలలో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో కూడా పృథ్వీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయింది. అయితే చిత్ర బృందానికి సంబంధించి అందరిని ఒక్కొక్కరిగా పిలిచి పరిచయం చేస్తుండగా, బబ్లూ పృథ్వీరాజ్‌ను కూడా పిలిచి విజయశాంతి మాట్లాడారు.
ఆ సమయంలో పృథ్వీ విజయశాంతి కాళ్లకు నమస్కరించారు. ‘మీరు నా చిన్న తమ్ముడు’ అని విజయశాంతి అనగా.. ‘నేను ఈ అక్కకు ప్రియమైన తమ్ముడిని’ అంటూ పృథ్వీ చెప్పారు. . దీంతో ఆడియన్స్ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 1999లో శరత్ కుమార్, విజయశాంతి కీలక పాత్రల్లో రూపొందిన ‘రాజస్థాన్’ సినిమాలో పృథ్వీ నటించారు. ఆ తర్వాత ‘వైజయంతి’ సినిమాలో విజయశాంతి సోదరునిగా నటించారు. ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ ‘నాయాల్ది’ రిలీజ్ కాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా తల్లీకొడుకుల అనుబంధాన్ని తెలిపే ‘ముచ్చటగా బంధాలే’ సాంగ్ సైతం ఆకట్టుకుంటోంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరగనుంది. ఈ ఈవెంట్‌కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు.