Prince Movie On OTT | తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ‘రెమో’, ‘డాక్టర్’, ‘డాన్’ వంటి సినిమాలు తెలుగులోనూ మంచి వసూళ్ళు సాధించాయి. ఈ క్రమంలో నేరుగా తెలుగు దర్శకుడు అనుదీప్‌తో కలిసి ‘ప్రిన్స్’ సినిమా చేశాడు. రిలీజ్‌కు ముందు మేకర్స్ జరిపిన ప్రమోషన్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చాయి. పైగా జాతిరత్నాలు వంటి భారీ విజయం తర్వాత అనుదీప్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్21న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫుల్ రన్లో బ్రేక్ఈవెన్ పూర్తి చేసుకోకుండానే థియేటర్లలో నుండి వెళ్ళిపోయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కన్సార్మ్ అయింది. ప్రిన్స్ మూవీ ఓటీటీ హక్కులను డిస్నీ హాట్‌స్టార్ సంస్థ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా నవంబర్ 25నుండి తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క నటించింది. సత్యరాజ్ కీలకపాత్రలో నటించాడు. థమన్ సంగీతం అందించాడు. థమన్ పాటలు కూడా సినిమాకు ప్లస్ కాలేకపోయాయి.