Sunny Leone | సినిమాల నుంచి తప్పకున్న బాలీవుడు ఐటం బాంబు సన్నీ లియోన్ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ భామకు వివాదాలు కొత్తేమీ కాదు. సన్నీ ఏ సాంగ్ చేసినా అది వివాదానికి దారి తీస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ సెగలు పుట్టిస్తోంది. సన్నీ లియోని లేటెస్ట్ ఆల్బమ్ ‘నాచే.. మై మధుబన్ రాధిక’ వీడియో సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే వివాదాలకు దారి తీసింది. ఈ సాంగ్‌ను కనికా కపూర్, అరింద్ చక్రవర్తి పాడారు.
అయితే ఈ పాట హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సమాజానికి సన్నీ లియోన్ క్షమాపణ చెప్పాలని ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆల్బమ్‌లో నటించిన సన్నీ లియోన్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తప్పకుండా తాము కోర్టును ఆశ్రయిస్తామని పూజారి సంత్ నావల్ గిరి మహారాజ్ స్పష్టం చేశారు. కనికా కపూర్ పాడిన ఈ పాట కృష్ణుడి ప్రియురాలు రాధను ఉద్దేశించి ఉంటుంది. అది ఆమెను అవమానపరిచేలా ఉందనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా ‘నాచే.. మై మధుబన్ రాధిక’ పాటను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 1960లో విడుదలైన కోహినూర్ చిత్రంలో మధుబన్ మై రాధిక నాచే పాటను రఫీ పాడారు.