Beauty | అంకిత్ కొయ్య, నీలఖి కాంబినేషన్లో వస్తోన్న చిత్రం బ్యూటీ (Beauty). జేఎస్ఎస్ వర్ధన్ సంభాషణలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లతోపాటు ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ మూవీ నుంచి ప్రెట్టీ ప్రెట్టీ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
ప్రెట్టీ ప్రెట్టీ మోడ్రన్ బ్యూటీ.. నడుపుతుందే మోటర్ స్కూటీ అంటూ హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్‌తో సూపర్ కూల్ లిరిక్స్‌తో సాగుతూ యూత్‌తోపాటు మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. సనారే రాసిన ఈ పాటను విజయ్ బల్గానిన్ కంపోజిషన్‌లో పీవీఎన్ఎస్ రోహిత్ పాడాడు. బ్యూటీ మూవీలో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ కీ రోల్లో నటిస్తున్నాడు.
‘కూతురు అడిగింది కొనిచ్చేటప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను..’అంటూ టీజర్లో తండ్రి తన కూతురు కోసం చెబుతున్న ఎమోషనల్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. మధ్యతరగతి కుటుంబం, యూత్‌ఫుల్ లవ్ ట్రాక్, తండ్రీకూతుళ్ల ఎమోషన్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
ప్రెట్టీ ప్రెట్టీ లిరికల్ వీడియో సాంగ్..
Vada Chennai 2 | వడ చెన్నై 2 వచ్చేస్తుంది.. క్రేజీ సీక్వెల్‌పై వెట్రిమారన్ ఏమన్నాడంటే..?
Game Changer Editor | డైరెక్టర్‌గా గేమ్ ఛేంజర్ ఎడిటర్.. స్టార్ హీరో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ..!