సినీరంగంలో ఔత్సాహికుల్ని ప్రోత్సహించేందుకు షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నామని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఇందులో పాల్గొనడానికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదని, 5 నుంచి 25 నిమిషాల నిడివి గల షార్ట్‌ఫిల్మ్‌లను ఎంట్రీకి పంపించవచ్చని, ఎంట్రీలను జూన్ 13వ తేదీ వరకు స్వీకరిస్తామని చెప్పారు. ఎంపిక చేసిన విజేతలకు జూన్ 21న హైదరాబాద్‌లో అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తున్నామని, మొత్తం 20 విభాగాల్లో అవార్డులను అందజేస్తామని, ఇకపై ప్రతీ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన ఆర్.కె.గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు గురురాజ్, అల్లా భక్షు, కో ఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.