NTR31 | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో ఎన్టీఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. తారక్ ఈ చిత్రం కోసం మూడేన్నరేళ్ళు కేటాయించాడు. ప్రస్తుతం ఈ మూడున్నరేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు ఎన్టీఆర్ వరుసగా సినిమాలను ఒకే చేస్తూ సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. తాజాగా కొరటాల శివతో చేయనున్నNTR30 డైలాగ్ మోషన్ టీజర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. ఇదిలా ఉండగా శుక్రవారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా NTR31 సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో తారక్ గడ్డం, మీసం కట్టుతో ఊర మాస్‌లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం స్క్రీప్ట్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన నందమూరి తారక రామారావు ఆర్స్ట్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
#NTR31 🔥🔥🔥🔥🔥 https://t.co/kmP1CBONJb
— Mythri Movie Makers (@MythriOfficial) May 20, 2022