100 కోట్ల క్లబ్లో చేరాం
‘ప్రయత్నిస్తే కచ్ఛితంగా జరుగుతుంది అనే పాయింట్‌తో ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి, దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ముగ్ధులం అయ్యాం. అడాప్టెడ్ సన్ అంటూ నామీద మీమ్స్ వస్తున్నాయి. నన్ను మీలో ఒకడిగా చేర్చుకున్నందుకు థ్యాంక్స్.’ అన్నారు హీరో ప్రదీప్ రంగనాథన్.
‘ప్రయత్నిస్తే కచ్ఛితంగా జరుగుతుంది అనే పాయింట్‌తో ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి, దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ముగ్ధులం అయ్యాం. అడాప్టెడ్ సన్ అంటూ నామీద మీమ్స్ వస్తున్నాయి. నన్ను మీలో ఒకడిగా చేర్చుకున్నందుకు థ్యాంక్స్.’ అన్నారు హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్’. అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ కథానాయికలు. అశ్వత్ మారిముత్తు దర్శకుడు. కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలు. గత నెల 21న విడుదలైన ఈ సినిమా వందకోట్ల క్లబ్లో జాయిన్ అయ్యింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడారు. ‘సినిమాలో ఎమోషన్ కనెక్టయితే.. అన్ని పాత్రలూ కనెక్టవుతాయి అని నిరూపించిన రాజమౌళీ నాకు స్పూర్తి. ప్రేమ, స్నేహం, తల్లిదండ్రులు అనేవి యూనివర్సల్ కాన్సెప్టులు. ఈ మూడూ ఈ సినిమాలో ఉంటాయి. అందుకే సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది.’ అని దర్శకుడు అశ్వత్ మారిముత్తు అన్నారు. ఇంకా చిత్ర నిర్మాతల్లో ఒకరైన కల్పాతి అర్చనతో పాటు మైత్రీ అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్, మైత్రీ శశిధర్, సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

