‘ఫౌజీ’ టీజర్‌పై వివాదం
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ టీజర్ వివాదంలో చిక్కుకుంది. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ టీజర్లో కొన్ని సన్నివేశాలను చూపించారని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ ఆరోపించారు. టీజర్‌ను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే ‘ఫౌజీ’ టీజర్‌ను విడుదల చేశారు.

ఇందులో ప్రభాస్ పోషించిన సైనికుడి పాత్ర గురించి జర్మనీ నియంత హిట్లర్‌కు వివరిస్తుంటారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. బ్రిటీష్ వారిని ధిక్కరించిన గొప్ప సైనికుడిగా ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తాడు. 1942లో నేతాజీ సుభాష్‌చంద్రబోస్, హిట్లర్ల మధ్య జరిగిన సమావేశాన్ని ఈ టీజర్లో చూపించారు. అదే ఈ వివాదానికి కారణమైంది. చరిత్రకు కల్పనను జోడించడం నేరం అంటూ చంద్రకుమార్ బోస్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ‘దర్శకుడు హను రాఘవపూడి టీమ్ టీజర్‌ను తొలగించి.. నిజమైన చరిత్రతో టీజర్‌ను రిలీజ్ చేయాలని ఆశిస్తున్నా. ఈ పోస్ట్‌ను ప్రభాస్ కూడా చదువుతారని కోరుకుంటున్నా’ అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు