ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. తమ అభిమాన హీరో చాలా రోజుల తర్వాత లవర్ బాయ్‌గా నటించిన రాధేశ్యామ్ (Radhe Shyam) థియేటర్లలో విడుదలైంది. 1976 యూరప్ బ్యాక్ డ్రాప్లో ప్రేమపై అంతగా విశ్వాసం లేని హస్తసాముద్రిక నిపుణుడు విక్రామాదిత్య (Vikram Aditya) పాత్రలో నటించాడు ప్రభాస్. అతని ప్రయాణంలో తారసపడే పడే ప్రేరణ అనే అమ్మాయి పాత్రలో పూజాహెగ్డే (Pooja Hegde) నటించింది. డార్లింగ్, మిర్చి చిత్రాల తర్వాత ప్రభాస్ తనలోని లవర్ బాయ్‌ను మళ్లీ అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు.
చాలా గ్యాప్ తర్వాత ప్రభాష్ లవర్ బాయ్ గా ఎలా కనిపిస్తాడోనని ఫ్యాన్స్ లో ఉన్న డైలామాకు తెరదించాడు ప్రభాస్. యంగ్ ఎనర్జిటిక్ లుక్‌లో స్టైలిష్‌గా తనపాత్రలో ఒదిగిపోయాడని సినిమా చూసిన వాళ్లు అంటున్నారు. ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ రాధేశ్యామ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తున్నాయని మూవీ లవర్స్ చెబుతున్నారు. అభిమానులు, ప్రభాస్ నుంచిఎలాంటి కథను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సరిగ్గా అలాంటి కథతోనే వచ్చాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి బాహుబలి, సాహో లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలు చేసిన ప్రభాస్ మళ్లీ డార్లింగ్ గెటప్‌లో మునుపటిలా అలరించడంలో ఎలాంటి కాంప్రమైజ్ కాబోడని రాధేశ్యామ్ చెప్పకనే చెబుతోంది. రాధేశ్యామ్ చిత్రం ప్రభాస్‌కు ఏ రేంజ్లో సక్సెస్ అందిస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి. మరోవైపు ప్రేరణగా నటించి పూజాహెగ్డే కెరీర్లోనే బెస్ట్ రోల్ లో కనిపించిందని అంటున్నారు.