సినిమా అయినా, వెబ్ సిరీస్, స్పెషల్ ఈవెంట్ అయినా చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ అభిమానులు, ఫాలోవర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది సమంత (Samantha). తన ఫాలోవర్లలో ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ జోష్ నింపుతుంటుంది. నెట్టింట్లో ట్రెండీ ఫొటోలు, వర్కవుట్స్ వీడియోలు, మోటివేషన్ పోస్టులు పెడుతుంది. ఈ భామ తాజా ఖరీదైన బ్రాండ్ అవుట్‌ఫిట్ లో హొయలు పోతూ నెటిజన్లకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఈవెంట్ (Critics Choice Awards events) లో డీప్ కట్ డిజైనర్ గౌన్ (deep cut designer gown ) లో గ్లామరస్ క్వీన్‌గా అవతారమెత్తింది. నా ఫేవరేట్ లుక్స్ లో ఒకటి అంటూ కొంటెగా చూస్తూ సమంత కెమెరాకు ఫోజులిచ్చింది. గ్రీన్ కాస్ట్యూమ్స్ లో సామ్ మెస్మరైజింగ్ లుక్‌తో దిగిన ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇటీలే పుష్ప సినిమాలో ఊ అంటావా ఊఊ అంటావా అనే సాంగ్‌తో పాన్ ఇండియా మూవీ లవర్స్ ను పలుకరించింది సామ్. ఈ పాటలో హాట్ హాట్ స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు.
సమంత ఇప్పటికే గుణ శేఖర్ డైరెక్షన్లో నటిస్తోన్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసింది. మరో ఫీ మేల్ ఓరియెంటెడ్ మూవీ యశోదలో నటిస్తోంది. దీంతోపాటు విఘ్నేశ్ శివన డైరెక్షన్లో కాతువాకుల రెండు కాధల్‌లో నటిస్తోంది. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.