మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR). ఎన్నో అడ్డంకులను దాటుకుని ఫైనల్‌గా వరల్డ్‌వైడ్‌గా మార్చి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయేందుకు ముస్తాబవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) అండ్ టీం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ (RRR Promotions)ను సరికొత్తగా ప్లాన్ చేస్తూ ముందుకెళ్తున్నారు.
బిగ్ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ నుంచి ఎత్తర జెండా పాటను మార్చి 14న విడుదల చేస్తున్నట్టు జక్కన్న టీం ప్రకటించింది. అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై అభిమానులకు రాజమౌళి అండ్ టీం క్లారిటీ ఇచ్చింది. మార్చి 18,19వ తేదీల్లో దుబాయ్, బెంగళూరు ఈవెంట్స్ నిర్వహించనున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ప్రమోషన్స్ లో భాగంగా పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ మేకర్స్.
ఆర్ఆర్ఆర్(RRR)లో రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజుగా నటిస్తోండగా..జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రం భీం రోల్ పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియాభట్ సీత రోల్లో నటిస్తోంది. హాలీవుడ్ భామ ఒలివియో మొర్రీస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.అజయ్ దేవ్గన్, సముద్రఖని, శ్రియా శరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.