చెన్త్నె సోయగం శృతిహాసన్‌కు జిహ్వా చాలప్యం కాస్త ఎక్కువే. నోరూరించే వంటకాల్ని లాగించే విషయంలో అస్సలు రాజీపడదు. ఈ ముద్దుగమ్మ భోజయప్రియత్వానికి తగినట్టు హైదారాబాద్‌లో బ్రహ్మాండమైన ఆతిథ్యాన్ని స్వీకరిస్తోంది. ఈ భామకు అద్భుతమైన ఆతిథ్యాన్ని అందిస్తూ ఖుషీ చేస్తున్నది మరెవరో కాదు…అగ్ర హీరో ప్రభాస్. సాధారణంగా తనతో కలిసి నటించే సహ నటులకు చక్కటి ఆతిథ్యాన్ని అందించడం ప్రభాస్‌కు ఓ ఆనవాయితీగా వస్తోంది. ఎదుటివారి ఆహారాభిరుచిని తెలుసుకొని అందుకు తగినట్లుగా షడ్రసోపేతమైన ఆహార పదార్థాలతో మెనూను సిద్ధం చేయిస్తారు ప్రభాస్. ఆయన సెట్లో ఉన్నాడంటే వెరైటీ వంటకాలకు కొదువుండదని చెబుతుంటారు. ప్రస్తుతం ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న ‘సలార్’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా శృతిహాసన్ కోసం ఇరవై రకాల వంటకాల్ని సిద్ధం చేశారట ప్రభాస్. ఈ ఫుడ్ మెనూను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది శృతిహాసన్. తన అభిరుచికి తగిన చక్కటి వంటకాల్ని ప్రిపేర్ చేసిన ప్రభాస్‌కు శృతిహాసన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆతిథ్యంలో తమ డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారని మురిసిపోతున్నారు.