ప్రభాస్ మోకాలి ఆపరేషన్ నుంచి కోలుకోలేదా.. తోడు తీసుకుని నడుస్తున్నాడు..ప్రభాస్ (Prabhas)ని ప్రస్తుతం చూస్తున్న వాళ్లకు ఎవరికైనా ఈ అనుమానం వస్తుంది. ఎందుకంటే తాజాగా అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంచ్ కు వచ్చిన ఈయన ఒక్కడే నడవలేకపోయాడు. మెట్లు కూడా ఎక్కలేక ఇబ్బంది పడ్డాడు. నడుస్తున్నప్పుడు చాలా అన్ ఈజీగా కనిపించాడు ప్రభాస్. పక్కనే దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ సాయం తీసుకుని నడిచాడు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు కంగారుపడుతున్నారు. తమ హీరోకు ఏమైందో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు.
ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రభాస్ యాక్షన్ సినిమాలు (Action Movies) మాత్రమే చేస్తున్నాడు.
రాజమౌళి మేనియా నుంచి బయటికి రావాలంటే దాన్ని మించిన యాక్షన్ సినిమాలు చేయడం తప్ప.. మరో దారి లేదని ఆయన నమ్ముతున్నాడు. అందుకే సాహో, సలార్ లాంటి సినిమాలు ఒప్పుకున్నాడు ఈయన. మధ్యలో రాధే శ్యామ్ లవ్ స్టోరీ అయినా కూడా దాని కోసం ఫిజికల్ గా చాలా కష్టపడ్డాడు ప్రభాస్. ఆదిపురుష్ మాత్రం ఎక్కువగా గ్రాఫిక్స్ నమ్ముకుని తీసాడు దర్శకుడు.
ఇదిలా ఉంటే చాలా రోజులుగా ప్రభాస్ కు మోకాలి సమస్య ఉంది. దానికి సంబంధించిన సర్జరీ (Knee operation) ఈ మధ్య పూర్తి చేసుకున్నాడు ప్రభాస్. సరైన రెస్ట్ తీసుకోకుండా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. అంతలోనే పెదనాన్న కృష్ణంరాజు చనిపోవడంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు రెబల్ స్టార్. వారం రోజుల తర్వాత మళ్ళీ సలార్ సినిమా షూటింగ్ లో కనిపించాడు.
ఇదిలా ఉంటే తాజాగా అయోధ్యలో ప్రభాస్ ఒక్కడు సరిగ్గా నడవలేకపోవడం చూసిన తర్వాత కాలి నొప్పి (Knee Pain) ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే చాలా చిన్న మెట్లు కూడా పక్కన వాళ్ళ సహాయం తీసుకొని దిగుతున్నాడు ప్రభాస్. ఇలాంటి సమయంలో ఆయన విశ్రాంతి తీసుకోవడం మంచిది అని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.
ప్రభాస్ మోకాలి ఆపరేషన్ నుంచి కోలుకోలేదా.. తోడు తీసుకుని నడుస్తున్నాడు..! #Prabhas #Adhipurush pic.twitter.com/FGW9R7n9JW
— Namasthe Telangana (@ntdailyonline) October 3, 2022
సినిమాలు కావాలంటే తర్వాత చేసుకోవచ్చు కానీ మీరు మాత్రం ఆరోగ్యంగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు. అయితే ఆయన కోసం చాలామంది దర్శకులు వేచి చూస్తున్నారు. నిర్మాతలు కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. అందుకే కాలు అంతా ఇబ్బంది పెడుతున్న కూడా వరుస షూటింగ్స్ చేస్తున్నాడు ప్రభాస్. దసరా తర్వాత ఆయన మారుతి సినిమాలో జాయిన్ అవుతున్నాడు. ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చాడు ప్రభాస్. దీంతోపాటు ప్రశాంత్ నీల్ సినిమా ఎలాగూ ఉండనే ఉంది.