Spirit | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ట్రాక్‌లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ (Spirit). యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.
తాజా రిపోర్ట్స్ ప్రకారం స్పిరిట్ కొత్త షెడ్యూల్ రేపు షురూ కానుందట. ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య వచ్చే హై ఆక్టేన్ ఫైట్ సీక్వెన్స్‌ను ఈ షెడ్యూల్లో షూట్ చేయనున్నారని ఇన్సైడ్ టాక్. అంతేకాదు సుమారు 2 నెలలపాటు సుదీర్ఘంగా ఈ షెడ్యూల్ కొనసాగనుందట. ఇందులో ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్‌గా నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో యానిమల్ ఫేం తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా హోం బ్యానర్ భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్‌తో కలిసి సంయుక్తంగా తెరకక్కిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రాణే సంగీతం అందిస్తున్నాడు. స్పిరిట్‌లో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ (డాన్ లీ) మడాంగ్సియోక్ (MaDongSeok) విలన్‌గా నటిస్తున్నాడని వార్తలు రాగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది.
TN CM Vijay | తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్.. మహిళల భద్రత సహా పలు ఫైళ్లపై సంతకాలు
Anna Lezhneva | మదర్స్ డే సందర్భంగా అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
Watch: తలలో దిగిన కొడవలితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?