పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సలార్ వర్కింగ్ స్టిల్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో తెలియజేస్తున్నాయి. కాగా ఇపుడు సలార్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం సలార్ కొత్త షెడ్యూల్ ఇవాళ హైదరాబాద్‌లో షురూ అయింది. 35 రోజుల పాటు సాగనున్న ఈ ముఖ్యమైన షెడ్యూల్ షూటింగ్లో ప్రభాస్‌తోపాటు ప్రధాన తారాగణం జాయిన్ కానుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. ప్రభాస్ ఇప్పటికే మారుతి దర్శకత్వంలో నటిస్తోన్న షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. షూటింగ్ స్పాట్ నుంచి విడుదలైన స్టిల్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు ప్రభాస్.
ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. జగపతిబాబు, ఈశ్వరీ రావు, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, శ్రియారెడ్డి, మధు గురుస్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేజీఎఫ్ ప్రాంఛైజీ అందించిన టాప్ బ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రభాస్ వీటితోపాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కే కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తున్నారు. తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న మైథాలాజికల్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.