Salaar 1st day collections | ప్రభాస్ `సలార్` తొలి రోజు రికార్డ్ వసూళ్లు.. రూ.175 కోట్లు దాటిన కలెక్షన్లు..!
Salaar 1st day collections | విడుదలైన తొలి రోజే ప్రభాస్ ‘సలార్’ సినిమా బాక్సాఫీసు రికార్డులు బ్రేక్ చేసింది. మొదటి రోజు కలెక్షన్లు రూ.175 కోట్లు దాటినట్లు తెలుస్తున్నది.
Salaar 1st day collections | అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ నటించిన కొత్త సినిమా ‘సలార్’ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు తొలి రోజే అదరగొట్టాయి. శుక్రవారం ఒక్కరోజే మొత్తం రూ.175 కోట్లకు పైగా వసూలు అయ్యాయి. వాటిల్లో దేశీయంగా రూ.135 కోట్లు వసూలు కావడం గమనార్హం. ఇండస్ట్రీ ట్రాకింగ్ సైట్ సాక్నిల్క్ కథనం ప్రకారం దేశీయంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రూ.49 కోట్లు కాగా, శుక్రవారం ఒక్కరోజే రూ.60 కోట్లు దాటాయి. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో చిత్రీకరించారు. భారత్‌లో ఆన్లైన్ బుకింగ్స్ రూ.42 కోట్లు దాటాయి. తొలి రోజే ఆన్లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్స్ రూ.180 కోట్లు ఉంటాయని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45 కోట్లు వసూలు చేస్తే భారత్ బాక్సాఫీసు వద్ద రూ.135 కోట్లు వసూలవుతాయని చెబుతున్నారు. 2023లో విడుదలైన సినిమాల్లో తొలి రోజే భారీ వసూళ్లతో రికార్డు నెలకొల్పిన సినిమాగా ‘సలార్’ నిలుస్తుంది.
సలార్ సినిమా రెండు భాగాల్లో నిర్మిస్తున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’, రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ అని టైటిల్ పేర్లు ఖరారు చేశారు. దేవా/ సలార్‌గా ప్రభాస్, వరద రాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమన్నార్‌గా జగపతి బాబు, ఆద్యగా శ్రుతి హసన్ నటిస్తున్నారు. సలార్ పార్ట్ వన్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడంతోపాటు పలు భాషల్లో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద షారూఖ్ ఖాన్ ‘డుంకి’తో పోటీ పడుతోంది సలార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

