Prabhas-Maruthi Movie | గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ప్రభాస్-మారుతి సినిమాకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాంబోలో సినిమాపై అధికారికంగా ప్రకటన రాకపోయినా.. ఇటీవలే చిత్రబృందం పూజా కార్యక్రమాలను జరుపుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపించింది. ఇప్పటికే మారతి ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేశాడట. ఈ సినిమాకు రాజా డిలక్స్ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా షూటింగ్‌ను దీపావళి కంటే ముందే స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా మారుతి ఓ చిన్న షెడ్యూల్‌ను దీపావళి లోపూ పూర్తి చేయనున్నాడట. ఈ షెడ్యూల్లో ప్రభాస్, సంజయ్‌దత్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా మొత్తం రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే తాత-మనవళ్ల కథతో సాగుతుందట. ఇదే కథకి హార్రర్ కమెడీ టచ్ అప్ ఇచ్చి మారుతి తన శైలిలో తెరకెక్కించనున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ థియేటర్ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తుంది. కేవలం ఈ సెట్ కోసమే మేకర్స్ 6కోట్లు ఖర్చు చేశారట. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.
Read Also:
Kantara Movie | తెలుగులో రిలీజ్ కానున్న.. కన్నడ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ?
Vikram Vedha | ‘100’ కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘విక్రమ్ వేద’.. కానీ?
NBK108 | బాలయ్య-అనీల్ రావిపూడి సినిమాలో.. టాలీవుడ్ టాప్ టెక్నీషియన్?