NBK108 | బాలయ్య-అనీల్ రావిపూడి సినిమాలో.. టాలీవుడ్ టాప్ టెక్నీషియన్?
NBK108 Technician | నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు అదే జోష్‌ను తన తదుపరి సినిమాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు.
NBK108 Technician | నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు అదే జోష్‌ను తన తదుపరి సినిమాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని తర్వాత బాలయ్య, అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అనిల్ ఈ చిత్రాన్నిఅవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ టెక్నీషియన్ పనిచేయనున్నాడట. ఎవరా? టాప్ టెక్నీషియన్ అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రామ్‌ప్రసాద్. ఇటీవలే ఈయన బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాడు. బాలయ్యతో ఇప్పటికే ఈయన ఆరు సినిమాల్లో పనిచేశాడు. కాగా ఈ చిత్రంతో ఏడో సారి బాలయ్యతో జతకడుతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య 45 సంవత్సరాలున్న తండ్రి పాత్రలో నటించనున్నాడని సమాచారం. పెళ్లిసందడి ఫేం శ్రీలీలా బాలయ్య కూతురులా నటించింది. ఈ సినిమా మొత్తం ఫాదర్-డాటర్ ఎమోషన్‌తో సాగుతుందని అనీల్ ఇదివరకే తెలిపాడు. బాలకృష్ణకు జోడీగా అంజలి నటించనుందని టాక్.
Read Also:
Kantara Movie | తెలుగులో రిలీజ్ కానున్న.. కన్నడ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ?
Vikram Vedha | ‘100’ కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘విక్రమ్ వేద’.. కానీ?
Suriya | సీక్వెల్‌కు సిద్ధమవుతున్న సూర్య బ్లాక్‌బస్టర్ మూవీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

