Kalki 2898 AD | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వాయిదా పడననున్నట్లు తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 09న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తాజాగా మూవీని వాయిదా వేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. మే 09 న ఈ సినిమా విడుదల కానుంది అని ప్రకటించిన అనంతరం తెలంగాణ లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడింది. దీంతో ఎలక్షన్ ఎఫెక్ట్ ఈ సినిమా పడునున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్ర సీజీ వర్క్స్ కూడా ఇంకా పూర్తి కాలేదని టాక్ కాగా దీనిపై వైజయంతి మూవీస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమాకు మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, పశుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం (Mahabharat) కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది.