Kannappa Movie | టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇప్పటికే ఈ చిత్రంలో నటించే అగ్ర నటులు తమ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా కన్నప్ప సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్లో ప్రభాస్ పరమశివుడిగా కనిపిస్తుండగా.. పోస్టర్‌తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు మేకర్స్. మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ ఖిలాడీ, నటుడు అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అక్షయ్ కుమార్. తాజాగా అతడి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
.#Prabhas Joins The Shoot 🏹#kannappa🏹 @iVishnuManchu pic.twitter.com/xyvwCsLylK
— BA Raju’s Team (@baraju_SuperHit) May 9, 2024
విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్పలో మోహన్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.