Prabhas 25 | ప్రభాస్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకేసారి నాలుగు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు యంగ్ రెబల్ స్టార్. అందులో ఏవి ఎప్పుడు విడుదల అవుతాయో ఎవరికీ పెద్దగా క్లారిటీ లేదు. ప్రస్తుతం దర్శక నిర్మాతలు చెబుతున్న దాన్ని బట్టి సంక్రాంతికి రాధే శ్యామ్ విడుదలవుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వెంటనే ఆది పురుష్ విడుదల కానుంది. ఈ మూడు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ సినిమా మొదలు కానుంది. అశ్వినీదత్ నిర్మాణంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ టైం మిషన్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇది ప్రభాస్ కు 24వ సినిమా.
ఒకేసారి నాలుగు సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వడంతో 25వ సినిమా గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం తెర వెనుక భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం కనీసం 150 నుంచి 200 కోట్లు బడ్జెట్ పెట్టాలి. వరుసగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఒప్పుకుంటున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే ఈయన 25వ సినిమా ఎవరు తెరకెక్కించబోతున్నారు.. నిర్మాత ఎవరు అనే విషయంపై అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. దీనికి తగ్గట్టుగానే తన 25 వ సినిమాను ఒక పెద్ద నిర్మాతకు ప్రభాస్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనెవరో కాదు దిల్ రాజు.
ఇదివరకే ప్రభాస్ హీరోగా మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. త్వరలోనే ఈ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందని తెలుస్తోంది. ఒక పెద్ద దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కథ కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం వృందావన అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ తో ఇప్పుడు మామూలు సినిమాలు చేయడం సాధ్యం కాదు. అందుకే ఆయన ఇమేజ్ కు సరిపోయే పీరియాడికల్ కథ దిల్ రాజు సిద్ధం చేయిస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. 2024లో ప్రభాస్ 25వ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు ఒప్పుకున్న సినిమాలు మొత్తం పూర్తి చేయనున్నాడు ప్రభాస్.
నాగ్ అశ్విన్ సినిమా తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఆ తర్వాత 25వ సినిమా గురించి ఆలోచించనున్నాడు. ఎలాంటి హీరోకైనా 25వ సినిమా అంటే చాలా ప్రత్యేకం. అందుకే ప్రభాస్ కూడా తన మైల్ స్టోన్ మూవీ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
Cinema review: నూటొక్క జిల్లాల అందగాడు
ఫ్రెండ్స్‌తో సైకిల్‌పై చక్కర్లు కొడుతున్న సమంత.. పిక్ వైరల్
భీమ్లా నాయక్ పాటపై ఐపీఎస్ ఆఫీసర్ అభ్యంతరం