జనవరి 26న పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు పెద్ద సర్ ప్రైజ్..

Power star Puneeth Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి మూడు నెలలు కావస్తోంది. ఇప్పటికీ కర్ణాటకలో ఆయన్ను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ స్థాయి దాదాపు 100 కోట్లు దాటిపోయింది. పునీత్ చేసే ఒక సినిమా బడ్జెట్ 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఉంటుంది. దానికి తోడు ఈయన అగ్ర హీరో కావడంతో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉండేవాడు. చనిపోయే సమయంలో కూడా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి జేమ్స్ రెండోది ద్విత్వ. ఇందులో జేమ్స్ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇందులో బాడీ బిల్డర్‌గా నటించాడు పునీత్.
నిజానికి ఈ సినిమా కోసమే కొన్ని రోజులుగా కష్టపడ్డాడు పునీత్. గంటలు గంటలు జిమ్‌లో వర్కవుట్స్ చేశాడు. ఈ సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. జేమ్స్ సినిమా బడ్జెట్ దాదాపు 60 కోట్లు. ఈ సినిమాను చేతన్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. పునీత్ చనిపోయే ముందే ఈ సినిమా 90 శాతం పూర్తయింది. కేవలం క్లైమాక్స్ మాత్రమే బాకీ ఉంది. అంతలోనే పునీత్ మరణించడంతో జేమ్స్ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. దాంతో పాటు పవన్ కుమార్ దర్శకత్వంలో ద్విత్వ అనే భారీ బడ్జెట్ సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.. దీన్ని ఆపేశారు. ఈ సినిమా ప్రకటించిన తర్వాత ఆయన మరణించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు దర్శక నిర్మాతలు. జనవరి 26న ఆయన నటించిన చివరి సినిమా జేమ్స్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. దాంతో పవర్ స్టార్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
తమ అభిమాన హీరో నటించిన చివరి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పునీత్‌కు ఆయన అన్నయ్య శివ రాజ్‌కుమార్ డబ్బింగ్ చెబుతున్నాడు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటించడం విశేషం. మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇంద్ర సినిమాకు ఒక్కో టికెట్ అంత ధరకు అమ్మారా.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన బి.గోపాల్
పుష్ప డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలు డబ్బులు వెనక్కిస్తున్నారా..?
sirivennela | 2021లో హఠాన్మరణం చెందిన సినీ ప్రముఖులు వీళ్లే..
పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం అత్యుత్తమ పురస్కారం..
పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ఆ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమా? గంటలోనే ఎలా ప్రాణాలు పోయాయి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

