వకీల్ సాబ్ సినిమాను రాంగ్ టైం లో రిలీజ్ చేశారా..?
వకీల్ సాబ్ సినిమాను రాంగ్ టైం లో రిలీజ్ చేశారా.. చూస్తుంటే ఇప్పుడు అందరికీ ఇదే అనుమానాలు వస్తున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా కలెక్షన్లు రాలేదు.

చూస్తుంటే ఇప్పుడు అందరికీ ఇదే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు సరైన సమయంలో విడుదల చేస్తే వచ్చే కలెక్షన్ల సునామీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు వకీల్ సాబ్ విషయంలో మాత్రం అంచనాలు తప్పాయి. కరోనా సమయంలో ఈ సినిమాను విడుదల చేయడంతో కలెక్షన్లపై దెబ్బపడింది. కరోనా సెకండ్ వేవ్ మొదలై.. పరిస్థితులు అదుపు తప్పుతున్న సమయంలో వకీల్ సాబ్ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయం తీసుకున్నాడు. ఈ టైంలో పవర్ స్టార్ సినిమా విడుదల చేయడమే తప్పు అంటూ చాలామంది విమర్శించారు.

అయినా దిల్ రాజు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేశాడు. తొలి మూడు రోజులు కలెక్షన్లు బ్రహ్మాండంగా వచ్చాయి. ఉగాది సెలవులు ఉండటంతో మరో రెండు రోజులు ఎలాగోలా కలెక్షన్లు వచ్చాయి. కానీ అసలు చిక్కులు అన్నీ ఆ తర్వాత వచ్చాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య తగ్గింది. దీంతో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా కలెక్షన్లు రాలేదు. పైగా రూ.90 కోట్లు వసూలు చేస్తే కానీ సినిమా బ్రేక్ ఈవెన్ కాదు. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక డిస్ట్రిబ్యూటర్లు తల పట్టుకున్నారు.

రాంగ్ టైంలో విడుదల చేసినప్పుడు ఇలాంటి తలనొప్పి తప్పవు అని వాళ్లకు తెలియని విషయం కాదు. ఇప్పుడు సరిగ్గా అనుకున్నట్లే జరిగింది. ఈ సినిమా రూ.80 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇంత పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా వకీల్ సాబ్ అబోవ్ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఈ సినిమా గానీ సరైన సమయంలో విడుదల చేసి ఉంటే కచ్చితంగా రూ.150 కోట్లు వసూలు చేసేది అంటూ బల్లగుద్ది చెబుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రగడ కూడా సినిమా కలెక్షన్లపై దారుణమైన ప్రభావం చూపించింది. ఎలా చూసుకున్నా కూడా కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లు వకీల్ సాబ్ సినిమా కలెక్షన్స్ తగ్గిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కంగనా ‘ అష్టమి ప్రసాదం’ పై నెటిజన్ల ట్రోల్స్..!
జబర్దస్త్ లో కరోనా కలకలం..ఇంకా ఎంత మందికి వచ్చింది..?
వకీల్ సాబ్ పై మాజీ న్యాయమూర్తి ప్రశంసల జల్లు
అనిల్‌రావిపూడి కల నెలవేరబోతుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

