అధర్మానికి అడ్డునిలిచే సైంధవ్
‘రొటీన్‌గా కాకుండా ఏదైనా కొత్త కథ చేయాలని చూస్తున్న సమయంలో శైలేశ్ ‘సైంధవ్' కథ చెప్పాడు. ఈ కథలో భావోద్వేగాలకు ఎంత స్కోప్ ఉందో, యాక్షన్‌కి కూడా అంతే స్కోప్ ఉంది’ అన్నారు అగ్రకథానాయకుడు వెంకటేశ్.
‘రొటీన్‌గా కాకుండా ఏదైనా కొత్త కథ చేయాలని చూస్తున్న సమయంలో శైలేశ్ ‘సైంధవ్’ కథ చెప్పాడు. ఈ కథలో భావోద్వేగాలకు ఎంత స్కోప్ ఉందో, యాక్షన్‌కి కూడా అంతే స్కోప్ ఉంది’ అన్నారు అగ్రకథానాయకుడు వెంకటేశ్. ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధాశ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాశ్ కీలక భూమికలు పోషిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు. వెంకట్ బోయినపల్లి నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడారు.
‘ఇందులో నా పాత్ర కథరిత్యా వైల్డ్‌గా ఉంటుంది. మాస్ ప్రేక్షకులకేకాక, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చే సినిమా ఇది’ అని వెంకటేశ్ నమ్మకం వ్యక్తం చేశారు. అన్నయ్యలాంటి వెంకటేశ్‌గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘ ప్రతిష్టాత్మకమైన వెంకటేశ్‌గారి 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్‌గారికి కృతజ్ఞతలు. మహాభారతంలో సైంధవుడు ధర్మానికి ఒక్కరోజు అడ్డు నిలిచాడు. నా సైంధవుడు అధర్మాన్ని అడ్డునిలుస్తాడు. అది ఎలాగనేదే ఈ సినిమా కథ ’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

